
విశ్వావసు నామ శుభాకాంక్షలు
‘వి’శాల విశ్వంలో అందరూ..వి
‘శ్వా’ సముతో ధైర్యంగా జీవిస్తూ
‘వ’సుదైక కుటుంబంలో భాగమవుతూ
‘సు’గుణాల సంపదలను పంచుతూ
అరమరికలు లేని సంసారమున
షడ్రుచులతో కష్టసుఖాలను
సమరీతిన భావించే శక్తి అందించాలని
సర్వాంగ సుందరంగా తయారై
విశ్వకాంతులను పంచాలని వస్తోన్న
‘విశ్వావసు‘ నూతన వత్సరానికి
స్వాగతం... శుభస్వాగతం...
– ఇల్లూరి వెంకట్రామయ్య శెట్టి రిటైర్డు తెలుగు ఉపాధ్యాయుడు, అలంపూర్