
పరీక్షలు ముగిసే.. ఆనందం వెల్లివిరిసే..
గద్వాలటౌన్: పదో తరగతి పరీక్షలు ముగియడంతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. బుధవారం చివరి పరీక్ష రాసిన అనంతరం కేంద్రాల నుంచి విద్యార్థులంతా సంతోషంగా బయటకు వచ్చారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు ఆనందంతో బైబై చెప్పుకొన్నారు. కొంతమంది విద్యార్థులు సెల్ఫీలు దిగారు. చాలా కాలం కలిసి చదివిన వారంత పరీక్షల చివరిరోజు ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నవారు సాయంత్రానికే ఇళ్లకు బయలుదేరారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు వీరిని తోడ్కని వెళ్లారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద కోలాహలమే కనిపించింది. మళ్లీ కలుద్దాం మిత్రమా అంటూ ఇంటిబాట పట్టారు.
ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు..
పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం సాంఘికశాస్త్రం పరీక్ష జరిగింది. దీంతో మొత్తం పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. చివరిరోజు 7,600 మంది రెగ్యులర్ విద్యార్థులకుగాను 7,567 మంది పరీక్షలకు హాజరయ్యారు. 33 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాలను విద్యాధికారులు తనిఖీ చేశారు.

పరీక్షలు ముగిసే.. ఆనందం వెల్లివిరిసే..