పేదలందరికీ సన్నబియ్యం | - | Sakshi
Sakshi News home page

పేదలందరికీ సన్నబియ్యం

Apr 3 2025 1:24 AM | Updated on Apr 3 2025 1:24 AM

పేదలందరికీ సన్నబియ్యం

పేదలందరికీ సన్నబియ్యం

గద్వాల/ధరూరు/కేటీదొడ్డి: పేదలందరికీ సన్నబియ్యం రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందని.. సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం గద్వాల పట్టణంలోని 35,26 వార్డులలో, అలాగే ధరూరు, కేటీదొడ్డిలో సన్నబియ్యం కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆహార భద్రతను మెరుగుపర్చేందుకు ఉగాది పండుగ కానుకగా నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసే ప్రతీష్టాత్మక పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలు లావు బియ్యం తినలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 335 రేషన్‌షాపులు ఉండగా వాటి ద్వారా 1,62,000పైగా రేషన్‌కార్డులకు మొత్తం 5,50,000 మందికి పైగా లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతిఒక్కరికి నెలకు 6కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం సేకరించి వాటిని మరఆడించి మార్కెట్‌లో కిలో బియ్యం రూ.40 ఉన్న బియ్యాన్ని పేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఈసన్నబియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలించకుండా ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే రైతులు పండించిన ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌తో అదనపు ప్రయోజనం కల్పించడం జరిగిందన్నారు. త్వరలోనే కొత రేషన్‌ కార్డులను అందిస్తామని తెలిపారు. అనంతరం ధరూరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, తహసీల్దార్‌ మళ్లీఖార్జున్‌, డీఎస్‌వో స్వామికుమార్‌, రేషన్‌డీలర్లు పాల్గొన్నారు.

సర్వాయి పాపన్న పోరాటాన్ని స్ఫూర్తి తీసుకోవాలి

బడుగు బలహీనవర్గాలు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ వర్ధంతిని బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ బహుజన రాజ్యస్థాపనకు శ్రీకారం చుట్టిన మొట్టమొదటి యోధుడన్నారు. పన్నుల వసూళ్ల పేరుగా ప్రజలను పీడిస్తున్న మొగలులను అడ్డుకుని పోరాటం చేశారన్నారు. అలాగే, కేటీదొడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement