వ్యవసాయ అధికారులకు కొత్త సెల్‌ నంబర్లు | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ అధికారులకు కొత్త సెల్‌ నంబర్లు

Apr 3 2025 1:24 AM | Updated on Apr 3 2025 1:24 AM

వ్యవసాయ అధికారులకు కొత్త సెల్‌ నంబర్లు

వ్యవసాయ అధికారులకు కొత్త సెల్‌ నంబర్లు

గద్వాల వ్యవసాయం: వ్యవసాయ శాఖ జిల్లా, మండల స్థాయి అధికారులకు ప్రభుత్వం నూతన సెల్‌నంబర్లు కేటాయించింది. ఈమేరకు సక్రియానాయక్‌ డీఏఓ సెల్‌నం. 8977745995, రమేష్‌బాబు ఏడీఏ, సెల్‌నం. 8977745994, భవాని ఏఓ (టెక్నికల్‌) సెల్‌నం. 8977745626, మహాలక్ష్మీ ఏఓ (టెక్నికల్‌ 8977745627, శ్రీలత ఏఓ (టెక్నికల్‌) 8977745628, చంద్రశేఖర్‌ ఏఓ (టెక్నికల్‌) 8977745629, అశ్విని ఏఓ(టెక్నికల్‌) 8977745630, నాగార్జున రెడ్డి ఎంఏఓ అలంపూర్‌ 8977745645 సెల్‌ నంబర్‌ కేటాయించారు. అలాగే, జనార్ధన్‌ ఎంఏఓ అయిజ 8977745646, రవికుమార్‌ ఎంఏఓ ఇటిక్యాల 8977745647, ప్రదీప్‌కుమార్‌ ఎంఏఓ మానవపాడు 8977745648, సురేఖ ఎంఏఓ రాజోళి 8977745649, అనిత ఎంఏఓ ఉండవల్లి 8977745650, రాధ ఎంఏఓ వడ్డేపల్లి 8977745657, సంగీతలక్ష్మీ ఏడీఏ గద్వాల రూరల్‌ 8977745996, శ్రీలత ఎంఏఓ ధరూర్‌ 8977745658, ప్రతాప్‌ కుమార్‌ ఎంఏఓ గద్వాల 8977745659, హనుమంతురెడ్డి ఎంఏఓ గట్టుకు సెల్‌ నంబర్‌ 8977745684 కేటాయించారు. దీంతోపాటు సాజిద్‌ ఉర్‌ రహమాన్‌ ఎంఏఓ కెటీదొడ్డి 8977745685, రాజశేఖర్‌ ఎంఏఓ మల్దకల్‌ 8977746043, సుబ్బారెడ్డి ఏఓ (టెక్నికల్‌) అలంపూర్‌ ఏడీఏ కార్యాలయం 8977746018, చంద్రమౌళి ఏఓ (టెక్నికల్‌) గద్వాల ఏడీఏ సెల్‌నం. 8977746019, అయూబ్‌ ఏఓ (పీడీ అండ్‌ డీ ఫార్మ్‌ కొర్విపాడు) 8977745563, నాగేశ్వర్‌రావ్‌ ఏఓ (పీడీ అండ్‌ డీ ఫార్మ్‌ జులెకల్‌) సెల్‌నం. 8977745564 కేటాయించారు.

దరఖాస్తుల ఆహ్వానం

గద్వాల: ఇండియన్‌ ఆర్మీలో అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ (క్లర్క్‌, స్టోర్‌కీపర్‌, టెక్నికల్‌) అగ్నివీర్‌ ట్రేడ్‌మెన్‌ వివిధ కేటగిరీలకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు కోరుతున్నట్లు ఎంప్లాయిమెంట్‌ జిల్లా అధికారి ప్రియాంక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, టెక్నికల్‌, క్లర్క్‌, స్టోర్‌కీపర్‌ పోస్టులకు 10వ తరగతి, ట్రేడ్‌మెన్‌కు 8వ తరగతి పాస్‌ అయిన వారు అర్హులని తెలిపారు. www.join indiarmy.nic.in వెబ్‌సైట్‌లో ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, వీటితోపాటు ఐటీఐ, డిప్లోమా, ఎస్‌ఎస్‌సీ అర్హత పొందిన అభ్యర్థులకు బోనస్‌ మార్కులు ఉంటాయని తెలిపారు. కామన్‌ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా 13 భాషలలో ఆన్‌లైన్‌లో పరీక్ష ఉంటుందని, మెరిట్‌ ప్రకారం ఎంపిక చేస్తారని, జూన్‌లో సంబంధిత వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులు పొందవచ్చని, ఇతర వివరాలకు సికింద్రాబాద్‌లోని రిక్రూటింగ్‌ కార్యాలయం ఫోన్‌ నంబర్‌ 040–27740205 ను సంప్రదించాలని తెలిపారు.

ఉచిత శిక్షణ కార్యక్రమం

గద్వాల: స్కూల్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ద్వారా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌లో హైదరాబాద్‌లోని టీజీ బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ ఒక నెల నాన్‌రెసిడెన్సీయల్‌ ఉచిత ట్రైనింగ్‌ ప్రోగ్రాం ఇవ్వనున్నట్లు ఉపాధి కల్పనాధికారి డాక్టర్‌ ప్రియాంక తెలిపారు. డిగ్రీ పూర్తయి 26 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు www.tgbcstudycircle. cgg.gov.in లో ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దర ఖాస్తులు చేసుకున్న వారికి ఈనెల 12వ తేదీన ఉమ్మడి జిల్లా కేం్దద్రంలో స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 040–29303130 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణం కోసం స్థల పరిశీలన

కేటీదొడ్డి: మండల కేంద్రంలోని నూతన పోలీస్‌ స్టేషన్‌ భవన నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం పరిశీలించారు. ప్రజలకు అనువైన స్ధలాన్ని ఎంపిక చేసి త్వరలో నూతన భవన నిర్మాణం ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.

ఆలయాల్లో అడిషనల్‌ కమిషనర్‌ విచారణ

అలంపూర్‌ : అలంపూర్‌ క్షేత్ర ఆలయాల్లో దేవదాయ శాఖ అడిషనల్‌ కమిషనర్‌ కృష్ణవేణి బుధవారం విచారణ చేపట్టారు. దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయాల్లో విచారణ చేపట్టినట్లు ఆమె వివరించారు. ఇటీవల ఆలయాలపై పలు కథనాలు వచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలతో ఆలయాల్లో అన్ని అంశాలపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఉన్నతాధికారులకు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. గతంలోనూ రెండు సార్లు దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement