
కాకినాడ రూరల్: కాకినాడ డీప్ వాటర్ పోర్టు, యాంకరేజ్ పోర్టులను రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.వీర పాండ్యన్ మంగళవారం సందర్శించారు. జిల్లా కలెక్టరు కృతికా శుక్లాతో కలిసి విదేశాలకు బియ్యం ఎగుమతులు తీరును ఆయన పరిశీలించారు. నౌకలలోకి బియ్యం లోడింగ్ ప్రక్రియ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నా రు. సివిల్ సప్లయిస్ ఎండీ పర్యటనలో జేసీ ఇలక్కియ, అసిస్టెంట్ కలెక్టరు ప్రఖర్ జైన్, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజరు పుష్పమణి, పాల్గొన్నారు.
సెబ్ అధికారులతో సమీక్ష
కాకినాడ క్రైం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సెబ్ సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా అదనపు ఎస్‌పీ, సెబ్ ప్రత్యేకాధికారి శ్రీనివాస్ ఈ సమావేశం నిర్వహించారు. పెండింగ్ అరెస్టులపై ఆరా తీశారు. నాటు సారా తయారీ, అమ్మకం, విక్రయాలపై సమీక్షించారు. మద్యం అక్రమ రవాణాను నిలువరించేందుకు పలు సూచనలు చేశారు. ఛార్జిషీటు దాఖలు చేయడంలో జాప్యం వద్దని అన్నారు. పాత నేరస్తులతో పాటు అలవాటుగా నేరాలకు పాల్పడే వారి కదలికపై దృష్టి సారించాలన్నారు. కోర్టుల్లో విచారణలో ఉన్న కేసుల పురోగతిని పరిశీలించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment