ఎమ్మెల్సీ స్థానానికి రీ పోలింగ్ నిర్వహించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఉభయ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రీ పోలింగ్ నిర్వహించాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండపల్లి శ్రీనివాస్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఎన్డీఏ (టీడీపీ) కూటమి అభ్యర్థికి గట్టి పోటీ ఇస్తాననే ఉద్దేశంతో అధికార పార్టీకి చెందిన నాయకులతో ఎన్నికల అధికారులు కుమ్మకై ్క తన నామినేషన్‌ను కుట్ర పూరితంగా రిజెక్ట్ చేసి పోటీలో లేకుండా తప్పించారని ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలో శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడారు. ఉభయ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశానని చెప్పారు. తనకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈనెల 12 ఫిర్యాదు చేశానని.. అయితే అక్కడ న్యాయం జరగకపోవడంతో 25న కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారితోపాటు మిగిలిన అధికారులపై విచారణ జరిపించి తన నామినేషన్‌ను పునరుద్ధరించి ఆమోదించాలని, రీ పోలింగ్ నిర్వహించాలని కోరారు. ఈ విషయంలో తనకు న్యాయం జరిగే వరకూ పోరాడతానన్నారు.
ఆటల్లో గెలుపు
ఓటములు సహజం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఆటల్లో గెలుపు ఓటములు సహజం అని భారత హాకీ మాజీ కెప్టెన్ ధనరాజ్ పిళ్ళై పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా క్రీడామైదానంలో ఆలిండియా సివిల్ సర్వీసెస్ పురుషులు, మహిళల హాకీ పోటీలు ముగిశాయి. ముగింపోత్సవానికి టోర్నమెంట్ చీఫ్ కో–ఆర్టినేటర్, డిఎస్‌డీఓ బి.శ్రీనివాస్ కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఒలింపియన్, భారత హాకీ జట్టు కెప్టెన్‌ఽ ఒలింపియన్, ధనరాజ్ పిళ్ళై, గౌరవ అతిథిగా ఏపీ, తెలంగాణ ఇన్‌కమ్ టాక్స్ డైరెక్టర్ ఆనంద్ రాజేశ్వర్ భాయ్‌వార్ హాజరయ్యారు. ధనరాజ్ మాట్లాడుతూ పోటీలలో విజేతలుగా నిలిచిన సెంట్రల్ సెక్టార్ జట్టు, ఒడిశా జట్టును ఆయన అభినందించారు. ఈ పోటీలలో దేశవ్యాప్తంగా 44 జట్లు పాల్గొన్నాయి. పురుషుల విభాగంలో సెంట్రల్ సెక్టార్ ప్రథమ, హైదరాబాద్ సెక్టార్ ద్వితీయ, హర్యానా తృతీయస్థానాలు, మహిళల విభాగంలో ఒడిశా మొదటి, సెంట్రల్‌సెక్టార్ రెండవ, హర్యానా మూడవ స్థానాలు గెలుచుకున్నాయి. విజేతలకు అతిధులు బహుమతులు అందజేశారు. టోర్నమెంట్ స్పాన్సర్స్‌కు అతిధులు చేతుల మీదుగా మెమెంటోలు ఇచ్చారు. టోర్నమెంట్ కన్వీనర్, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కల్చరల్, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి రాహుల్ కుమార్, కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్ కుమార్ మీనా, ట్రైనీ కలెక్టర్ భావన, హాకీ సంఘ ప్రతినిధి రవిరాజు, జేఎన్టీయూకే వీసీ ప్రసాద్, జేఎన్టీయూకే స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి శ్యాంకుమార్, కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ వ్యవస్థాపకులు రవిచంద్ర, అంతర్జాతీయ హాకీ క్రీడాకారుడు డి.మురళీకృష్ణ, డీఎస్‌ఏ కోచ్‌లు పాల్గొన్నారు.
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
బాలాజీచెరువు: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరిగే ఈ పరీక్షలకు ఫస్టియర్ చదివే 22,260మంది హాజరుకానున్నారు. పరీక్షలకు అన్ని కళాశాలల నిర్వాహకులను ఇంటర్మీడియెట్ అధికారులు అప్రమత్తం చేశారు. గత ఫిబ్రవరి ఒకటో తేదీన విద్యార్థులకు మానవీయ విలువలు, పర్యావరణ విద్యవంటి అంశాల్లో అవగాహన ఎంత ఉందనేది పరీశీలన చేసే క్రమంలో వార్షిక పరీక్షలకు ముందు వీటిని నిర్వహించారు. ప్రతి విద్యార్థి ఈ పరీక్ష రాసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఫిబ్రవరి 5నుంచి ఇంటర్మీడియెట్ ఒకేషనల్ విద్యార్థులకు, 10 నుంచి జనరల్ కోర్సు విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించగా 89 కేంద్రాల్లో 21,871మంది హాజరయ్యారు. థియరీ పరీక్షలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు జరుగుతున్నంత సేపు కేంద్రాల్లో జరిగే ప్రతి కదలికను నిశితంగా పరిశీలించేలా సీసీ కెమెరాల లైవ్ కొనసాగేలా సాంకేతతికతను వినియోగించనున్నారు. వీటిని ఆర్‌ఐ కార్యాయలంతో పాటు ఇంటర్మీడియెట్ కేంద్ర కార్యాలయం నుంచి పరిశీలిస్తారు. జిల్లావ్యాప్తంగా మొదటి,రెండవ సంవత్సరం కలిపి 44,131 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
జీబీఎస్ వ్యాధిగ్రస్తుడు డిశ్చార్జి
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో వారం రోజులుగా చికిత్స పొందుతున్న జీబీఎస్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి కోలుకున్నాడు. అతనిని పూర్తి ఆరోగ్యవంతంగా తీర్చిదిద్ది శుక్రవారం డిశ్చార్జి చేసినట్టు వైద్యాధికారులు వెల్లడించారు. జీజీహెచ్‌లో మరో ముగ్గురు జీబీఎస్ బాధితులకు వైద్యసేవలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment