
హెల్త్ సిటీలో రక్త రుగ్మతల కేంద్రం
ఆరిలోవ (విశాఖపట్నం): మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని హెల్త్ సిటీ యునిక్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రక్త రుగ్మతుల కేంద్రాన్ని హెమటాలజీ పితామహుడు డాక్టర్ మామ్మెన్ చాందీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సికిల్ సెల్, తలసేమియాతో బాధపడుతున్నవారికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణను అభినందించారు. నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సదాశివుడు మాట్లాడుతూ విశాఖలో రక్త రుగ్మతుల కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఆరోగ్య సంరక్షణలో కీలక ముందుడుగు పడిందన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఏపీతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో ఎక్కడా రక్త వ్యాధులను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా హెమటాలజీ కేంద్రం లేదన్నారు. ఈ లోటును భర్తీ చేయడానికి ఇక్కడ సమగ్ర రక్త రుగ్మతల కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment