
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి ˘
కాకినాడ సిటీ: ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా ఎదగాలని జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, డీఆర్‌డీఏ, మెప్మా శాఖల సంయుక్త ఆధ్వర్యాన రాజా ట్యాంక్ ప్రాంగణంలో శనివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని తమ ప్రభుత్వం త్వరలోనే కల్పిస్తుందని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మే నెలలో చదువుకునే పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున వారి తల్లుల ఖాతాలో జమ చేస్తుందని చెప్పారు. డీఆర్‌డీఏ ద్వారా ఈ ఏడాది బ్యాంకు లింకేజీ కార్యక్రమం కింద 588 మహిళా స్వయం సహాయ బృందాలకు రూ.100 కోట్లు అందించామన్నారు. దీనికి సంబంధించిన మెగా చెక్‌ను అందజేశారు. ఓపెన్ నెట్‌వర్క్ డిజిటల్ కామర్స్ మిషన్ ద్వారా 78 వేల మంది మహిళలకు రూ.39 లక్షల మేర లబ్ధి చేకూర్చామన్నారు. కార్యక్రమంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎస్పీ జి.బిందుమాధవ్, నగరపాలక సంస్థ కమిషనర్ భావన తదితరులు పాల్గొన్నారు.
స్వయం ఉపాధి వైపు
అడుగులు వేయాలి
కాకినాడ రూరల్: మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ఆధ్వర్యాన కాకినాడ ఒకటో డివిజన్ వినాయక కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టైలరింగ్‌పై మహిళలకు మూడు నెలల శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మెషీన్లు అందిస్తామన్నారు. ఈ పథకం కింద జిల్లాలో 3,789 మందికి రూ.9.47 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
బాల బాలాజీకి
రూ.3.36 లక్షల ఆదాయం
మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి ఆలయానికి శనివారం భారీగా భక్తులు తరలి వచ్చారు. తెల్లవారు జామున సుప్రభాత సేవ, తొలి హారతితో దర్శనాలు ప్రారంభమయ్యాయి. వివిధ సేవల ద్వారా రూ.3,36,594 ఆదాయం వచ్చింది. స్వామి వారిని ఐదు వేల మంది భక్తులు దర్శించుకున్నారు. మూడు వేల మంది అన్న ప్రసాదం స్వీకరించారు.

మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి ˘
Comments
Please login to add a commentAdd a comment