గండేపల్లి: రోడ్డును శుభ్రం చేసే విధులకు వచ్చి పనుల్లో నిమగ్నమవుతున్న ఓ వ్యక్తి ప్రమాదానికి గురై, అక్కడిక్కడే మృతి చెందిన ఘటన ఇది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని గండేపల్లికి చెందిన దోనాదుల కృష్ణ (50) హైవే మెయింటెనెన్స్ వ్యాన్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తాను పని చేస్తున్న వాహనాన్ని శనివారం మురారి శివారులో నిలిపి, రోడ్డుపై కోన్స్ ఏర్పాటు చేస్తున్నాడు. ఈ తరుణంలో రాజమంహేంద్రవరం వైపు వెళ్తున్న లారీ హైవే మెయింటెనెన్స్ వ్యాన్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కృష్ణ రెండు వాహనాల మధ్య ఇరుక్కుని, అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యాడు. అతడి మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదంపై హైవే అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులు మండిపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకుని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో, హైవే మెయింటెనెన్స్ అధికారులు దిగి వచ్చారు. మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
·˘ {OyðlÐ]lÆŠ‡ §ýl$Æý‡ÃÆý‡×æ…
·˘ Ð]l$–™èl$° MýS$r$…»ê°MìS
న్యాయం చేయాలంటూ ఆందోళన