రూ.20,000 లంచం తీసుకుంటూ చిక్కిన వైనం
పిఠాపురం: పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్ రూ.20,000 లంచం తీసుకుంటూ సోమవారం రాత్రి ఏసీబీకి చిక్కారు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ కిషోర్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పిఠాపురం మండలం పి. దొంతమూరుకు చెందిన కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు నుంచి ఒక కేసుకు సంబంధించి రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం రాత్రి బాధితులు ఎస్సైకి లంచం ఇవ్వగానే ఏసీబీ అధికారులు వలపన్ని దాడి చేసి లంచం తీసుకుంటున్న ఎస్సైతో పాటు మధ్యవర్తిగా పనిచేస్తున్న ఎస్సై వ్యక్తిగత డ్రైవర్ శివను పట్టుకున్నారు. జరిగిన ఘటనపై కాకినాడ అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ శాఖపరమైన విచారణ చేపట్టారు.