
అందరికీ మేలు జరగాలి
● వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల
రీజనల్ కో ఆర్డినేటరు కన్నబాబు
● కాకినాడ రమణయ్యపేట కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు
● పంచాంగ శ్రవణంలో పాల్గొన్న
పార్టీ నాయకులు, కార్యకర్తలు
కాకినాడ రూరల్: విశ్వావసు తెలుగు నూతన సంవత్సరం మనందరికీ మంచి చేయాలని, రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత, అన్ని వర్గాలకు బాగుండాలని మేలు జరగాలని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటరు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆకాంక్షించారు. రమణయ్యపేట వైద్యనగర్ కార్యాలయంలో ఆదివారం కన్నబాబు ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. చీడిగ గ్రామానికి చెందిన సిద్ధాంతి వెంపరాల వరప్రసాద్ శర్మ పంచాంగ పఠనం చేశారు. ఈ ఏడాది నక్షత్ర, గోచార ఫలాలు ఎలా ఉంటాయో వివరించారు. అనంతరం ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ఈ సంవత్సరం అందరూ ఆరోగ్యంతో ఉండాలని, ప్రజలందరూ సంక్షేమాన్ని పొందేలా భగవంతుడు ఆశీర్వచనాలు ఉండాలని వైఎస్సార్ సీపీ తరఫున కోరుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ నామ సంవత్సరాలుగా ఉగాది వేడుకలు జరిగాయన్నారు. వైఎస్సార్ సీపీ పేదల పక్షాన నిలబడుతుందన్నారు. పార్టీ నాయకులు కురసాల సత్యనారాయణ, సినీ దర్శకుడు కురసాల కళ్యాణ్‌కృష్ణ, జెడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ, వైఎస్సార్ సీపీ మహిళా నాయకురాలు జమ్మలమడక నాగమణి, ఎంపీటీసీ సభ్యులు సారా రాజేష్, కొల్లా భాస్కరరావు, సర్పంచ్ రామదేవు చిన్నా, గోపుశెట్టి బాబ్జీ, పుల్ల చందు, పల్లంరాజు, కొప్పిశెట్టి గణేష్, తోటకూర శ్రీను పాల్గొన్నారు. పలువురు నాయకులు కన్నబాబును గజమాలతో సన్మానించారు.