న్యాయం చేయాలని అడిగితే బెదిరిస్తున్నారు
కామారెడ్డి టౌన్: భూసమస్యపై న్యాయం చేయాలని వేడుకుంటే తమపై పోలీసు కేసు పెడతానని గ్రామ పంచాయతీ కార్యదర్శి బెదిరింపులకు గురి చేస్తున్నారని గాంధారికి చెందిన బాధితులు బంజ శంకరప్ప, రాజప్పలు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. వంశపార్యపరంగా వస్తున్న తమ భూమిని కొందరు అక్రమంగా కబ్జా చేసుకుని వెంచర్లు వేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ విషయంలో ఆక్రమణదారులకు కార్యదర్శి సహకరిస్తూ తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని వేడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment