‘ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి’
కామారెడ్డి టౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు డైరెక్టర్, సెక్రెటరీ కృష్ణ ఆదిత్య సూచించారు. బుధవారం ఆయన కామారెడ్డి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. పరీక్ష కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, అధికారులు పాల్గొన్నారు.
క్రమశిక్షణతో ముందుకు సాగాలి
● అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి
భిక్కనూరు: విద్యార్థులు క్రమశిక్షణతో ముందు కు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహించవ చ్చని అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నా రు. బుధవారం రాత్రి ఆయన మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన వి ద్యార్థులతో మాట్లాడారు. తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని సూచించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవి, ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు.అనంతరం ఆయన విద్యార్థుల తో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట మండల ప్రత్యేకాధికారి రజిత తదితరులున్నారు.
అభ్యసన సామర్థ్యాల
పెంపుపై దృష్టిసారించాలి
బోధన్: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఉపాధ్యాయులకు సూచించారు. చదువుతో పాటు ఆరోగ్య అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. బుధవారం సాలూ ర జెడ్పీహెచ్‌ఎస్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను సబ్ కలెక్టర్, స్థానిక తహసీల్దార్ శశిభూషణ్‌తో కలిసి సందర్శించారు. పాఠశాలలో మధ్యా హ్న భోజన వంటశాలను పరిశీలించారు. విద్యార్థు లతో మాట్లాడి, వారి అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని హెచ్‌ఎంలకు ఆదేశించారు.
‘ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి’
‘ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి’
Comments
Please login to add a commentAdd a comment