అదృశ్యమైన మహిళ హత్య
మోర్తాడ్: నెల రోజుల క్రితం అదృశ్యమైన మహిళ హత్యకు గురైంది. ఈ ఘటనకు సంబంధించి భీమ్‌గల్ సీఐ సత్యనారాయణ, ఎస్సై రాము బుధవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని ఏర్గట్ల మండలం నాగేంద్రనగర్‌కు చెందిన కొండ లక్ష్మి(45) గ్రామంలో ఆశావర్కర్‌గా పనిచేస్తోంది. ఈ ఏడాది జనవరి 21న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె కుమార్తె అనూష ఏర్గట్ల పోలీసులకు ఫిర్యా దు చేయగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భా గంగా నిర్మల్ జిల్లా మామ డ మండలం పొన్కల్‌కు చెందిన కొంచపు వెంకటే శ్, లక్ష్మిని నమ్మించి తనవద్దకు పిలిపించుకొని హ త్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా నెల రోజుల క్రితమే ఆమెను పొన్కల్ అటవీ ప్రాంతంలో హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. అక్క డే పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. నిందితుడిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment