రుద్రూర్: మండలంలోని సులేమాన్‌నగర్ శివారులో నిల్వ చేసిన ఇసుక డంప్‌ను రెవెన్యూ అధికారులు బుధవారం సీజ్ చేశారు. గ్రామ శివారులో అక్రమంగా ఇసుక డంప్ చేశారనే సమాచారం మేరకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ భారతి వెళ్లి ఇసుక డంప్‌ను పరిశీలించారు. స్థానికంగా విచారణ చేపట్టగా అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించి సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుక సుమారు ఆరు ట్రాక్టర్ల వరకు ఉంటుందన్నారు. ఇసుకను ప్రభుత్వ అభివృద్ధి పనులకు కేటాయించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
షార్ట్ సర్క్యూట్‌తో మీసేవ కేంద్రం దగ్ధం
నిజాంసాగర్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మీసేవ కేంద్రం దగ్ధమైన ఘటన మండలంలోని మల్లూర్‌లో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మైపాల్ మీసేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం రాత్రి మీసేవ కేంద్రానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్‌తో మీసేవ కేంద్రంలోని కంప్యూటర్, ప్రింటర్‌తో పాటు జిరాక్స్ మిషన్, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతైంది. ప్రమాదంలో రూ.1.5 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. ప్రభుత్వ ప రిహారం చెల్లించి ఆదుకోవాలని బాధితుడు, గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment