ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
బాన్సువాడ/కామారెడ్డి టౌన్: రాబోయే నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్‌లో, మధ్యాహ్నం బాన్సువాడలోని ఎస్‌ఎంబీ ఫంక్షన్ హాల్‌లో గ్రాడ్యుయేట్ ఓటర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో 50 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 56 వేల ఉద్యోగాలిచ్చిందని పేర్కొన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేసిన బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేస్తారా అని పట్టభద్రులను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టబోతున్నామన్నారు. బాన్సువాడతో తనకు 40 ఏళ్ల బంధం ఉందని, ఆ బంధం విడదీయరానిదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి గుండు సున్నా నిధులు తెచ్చిన బీజేపీ నేతలను పట్టభద్రులు నిలదీయాలన్నారు.
బీజేపీ, బీఆర్‌ఎస్
అంతర్గతంగా ఒక్కటే..
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్,
మంత్రి జూపల్లి కృష్ణారావు
కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి
చేయాలని పట్టభద్రులకు పిలుపు
ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
Comments
Please login to add a commentAdd a comment