పురాతన ఆలయానికి పునర్వైభవం
బిచ్కుంద: మూడు వందల ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయం ధూపదీప నైవేద్యాలు కరువై మూతబడింది. దశాబ్దాలుగా పట్టించుకునేవారు కరువవడంతో ఆలయం శిథిలమైపోయింది. సుమారు 150 ఏళ్లుగా నిరాదరణకు గురైన ఆ ఆలయానికి ఓ భక్తుడు పునర్వైభవం తీసుకువచ్చాడు. వివరాలిలా ఉన్నాయి. బిచ్కుంద మండల కేంద్రంలోని తక్కడ్‌పల్లి రోడ్డులో గుట్ట వద్ద పురాతన శివాలయం ఉంది. దీనిని సుమారు మూడు శతాబ్దాల క్రితం నిర్మించారు. ప్రాచీన శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆలయం భక్తుల కొంగుబంగారంగా విలసిల్లింది. ఈ ఆలయాన్ని అప్పట్లో దైవాల గుడిగా పిలిచేవారని స్థానికులు చెబుతారు. అయితే తర్వాతి కాలంలో పాలకులు పట్టించుకోకపోవడంతో నిరాదరణకు గురై ఆనవాళ్లను కోల్పోయింది. గుడి సమీపంలో దయ్యాలు ఉన్నాయని ప్రచారం జరగడంతో చీకటి పడితే ప్రజలు ఆ దారిలో వెళ్లడం మానేశారు. దీంతో దైవాల గుడి కాస్తా దయ్యాల గుడిగా మారింది. కొందరు గుప్తనిధులకోసం గుడి ముందు భాగంలో తవ్వి ఆలయాన్ని ధ్వంసం చేయడంతో పూర్తిగా శిథిలమైంది.
వైవిధ్యమైన శిల్పాలతో..
ఈ ఆలయం మొత్తం వైవిధ్యమైన శిల్పాలతో నిండి ఉంది. గర్భగుడిలో ఆరడుగుల రాళ్లపై అద్భుతమైన శిల్పాలను తీర్చిదిద్దారు. ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని బిచ్కుందకు చెందిన జంగం నాగరాజు సంకల్పించారు. ఆయన రూ. 40 లక్షలతో ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టి సుందరంగా నిర్మించారు. పాత శిల్పాలను యథావిధిగా ఉంచి కొత్తగా గోడలు కట్టించారు. ఈ శివాలయాన్ని పునఃప్రారంభించేందుకు భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 10న అంగరంగ వైభవంగా శివ పార్వతుల విగ్రహాలను ప్రతి ష్ఠించనున్నట్లు స్థానికులు తెలిపారు.
శిథిలావస్థకు చేరిన ఆలయం(ఫైల్)
150 ఏళ్ల క్రితం
శిథిలమైన శివాలయం
రూ.40 లక్షలతో
పునర్నిర్మించిన భక్తుడు
వచ్చే నెల 10న విగ్రహ
ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు
సొంత నిధులతో..
వందల ఏళ్ల చరిత్ర కలిగిన గుడి శిథిలావస్థకు చేరడం బాధగా అనిపించింది. ఆలయానికి పూర్వవైభవం తీసుకురావాలని సంకల్పించాను. నేను రూ.40 లక్షలు వెచ్చించి పునర్నిర్మించాను. పాత ఆలయంలో చెక్కుచెదరకుండా ఉన్న రాతి శిల్పాలను అలాగే ఉంచాం.
– జంగం నాగరాజ్, బిచ్కుంద
పురాతన ఆలయానికి పునర్వైభవం
పురాతన ఆలయానికి పునర్వైభవం
Comments
Please login to add a commentAdd a comment