డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): జిల్లా సబ్‌జూనియర్ బేస్‌బాల్ బాలికలు, బాలుర జట్ల ఎంపిక పోటీలను శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా బేస్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మదుసూదన్‌రెడ్డి, సొప్పరి వినోద్ ఒక ప్రకటనలో తెలిపారు. డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి గ్రామ శివారులోగల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో నేడు ఉదయం 9 గంటలకు బాలికల జట్టు ఎంపిక పోటీలను నిర్వహిస్తామని వారు తెలిపారు. అలాగే బాలుర జట్టు ఎంపిక పోటీలకు ఆర్మూర్‌లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళాశాలలో నిర్వహిస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు జనవరి 2010 తర్వాత జన్మించి ఉండాలని, ఆసక్తి గలవారు జిల్లా కోచ్‌లు నరేష్, మౌనిక, జోత్స్నలకు రిపోర్ట్ చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment