నిజామాబాద్ రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో బీహార్‌కు చెందిన పలువురు హమాలీలు దారిదోపిడీకి పాల్పడారు. రూరల్ ఎస్‌హెచ్‌వో మహ్మద్ ఆరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామానికి చెందిన జితేష్ బుధవారం ఉదయం నిజామాబాద్‌కు శుభకార్యం నిమిత్తం వెళ్లగా, అర్ధరాత్రి తిరిగి సొంతూరికి బయలుదేరాడు. రూరల్ మండలం కొత్తపేట గ్రామ శివారులోని నిజాంసాగర్ కెనాల్ వద్ద అతడిని స్థానికంగా ఉన్న రైస్‌మిల్‌లో పనిచేస్తున్న హమాలీలు అడ్డుకొని కర్రలతో కొట్టి, చేతిపై తీవ్రగాయాలు చేశారు. అనంతరం అతడి వద్ద ఉన్న రూ.1000 నగదు, సెల్‌ఫోన్ దొంగిలించారు. బాధితుడు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment