క్రైం కార్నర్
కామారెడ్డి క్రైం: అదుపు తప్పిన కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలోని గోదాం రోడ్డులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు ఇలా. కామారెడ్డి మండలం శాబ్దిపూర్ గ్రామానికి చెందిన రేకులపల్లి యశోద (68) అనే వృద్ధురాలు వ్యక్తిగత పనుల మీద కామారెడ్డికి వచ్చి, ఇంటికి తిరిగి వెళ్లేందుకు గోదాం రోడ్డులో ఉన్న ఎఫ్‌సీఐ గోదాం వద్ద రోడ్డు పక్కన నిలబడి ఉంది. అదే సమయంలో డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన కారు మొదట వృద్ధురాలిని ఢీకొని ఆపై పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని సైతం ఢీకొంది. స్తంభానికి, కారుకు మధ్య వృద్ధురాలు చిక్కుకోవడంతో స్థానికులు గమనించి, వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. మృతురాలి కుమారుడు తిరుపతిరెడ్డి ఫిర్యాదు మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
రెండు బైక్‌లు ఢీకొని..
బోధన్‌రూరల్: మండలంలోని చిన్నమావంది బ్రిడ్జి వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరా లు ఇలా.. చిన్నమావంది గ్రామానికి చెందిన గంగొండ (64) బుధవారం రాత్రి పెగడపల్లి వెళ్లి తన బైక్‌పై గ్రామానికి తిరిగివస్తున్నాడు. అదే సమయంలో కల్దుర్కి గ్రామానికి చెందిన ఉమాకాంత్, తన చిన్నమ్మతో కలిసి పెగడపల్లి వైపు వెళ్తుండగా చిన్నమావంది బ్రిడ్జి వద్ద గంగొండ వాహనాన్ని ఎదురుగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గంగొండ అక్కడిక్కడే మృతిచెందగా ఉమాకాంత్, అతని చి న్నమ్మ శోభ గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. మృతుడు గంగొండ కుటుంబసభ్యుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్పై మచ్చేందర్‌రెడ్డి గురువారం తెలిపారు.
సంపులో పడి గుర్తు తెలియని మహిళ..
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని కమలానేహ్రు కాలనీ బృందాన్ టాకీస్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న భవనంం సంపులో పడి గుర్తుతెలియని మహిళ మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. నూతనంగా నిర్మిస్తున్న భవనంలో వాచ్‌మెన్ లేకపోవడంతో బుధవారం రాత్రి సమయంలో గుర్తుతెలియని మహిళ భవనం లోపల నిద్రించింది. ఒక్కసారిగా ఆమెకు ఫిట్స్ రావడంతో పక్కనే ఉన్న సంపుపడి మృతిచెందింది. మృతురాలి వయస్సు సుమారు 40ఏళ్లు ఉంటాయని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రిలో తరలించామని పోలీసులు తెలిపారు. మృతురాలి సంబంధికులు ఎవరైన ఉంటే పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ పేర్కొన్నారు.
చేపలవేటకు వెళ్లి మత్స్యకారుడు..
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో చేపల వేటకు వెళ్లిన ఓ మ త్స్యకారుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ముప్కాల్ ఎస్సై రజనీకాంత్ తెలిపిన వివరాలు ఇలా.. ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన బట్టు నడ్పిరాజన్న (52) రోజు మాదిరిగా బుధవారం రాత్రి ఎస్సారెస్పీలోకి చేపలవేటకు వెళ్లాడు. రాత్రి భోజన సమయానికి గట్టుకు రాకపోవడంతో తోటి మత్స్యకారులు అనుమానంతో గాలింపు చేపట్టారు. గురువారం ఉదయం అతడి మృత దేహం లభ్యమైంది. కాళ్లకు వల చుట్టుకుని ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందినట్లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం జరిగిన వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతిచెందారు. రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు, సంపులో పడి ఒకరు, చేపలవేటకు వెళ్లి ఒకరు మృత్యువాతపడ్డారు.
క్రైం కార్నర్
క్రైం కార్నర్
క్రైం కార్నర్
క్రైం కార్నర్
Comments
Please login to add a commentAdd a comment