ఉద్యోగ భద్రత కల్పించాలి
● ఉన్నత విద్యామండలి చైర్మన్‌కు
కాంట్రాక్టు అధ్యాపకుల వినతి
భిక్కనూరు: ఎన్నో ఏళ్లుగా యూనివర్సిటీల్లో పని చేస్తూ విద్యాభివృద్ధికి కృషిచేస్తున్న తమకు యూజీసీ స్కేలు వర్తింపజేయడంతో పాటు, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సౌత్‌క్యాంపస్‌లో ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డికి కాంట్రాక్టు అధ్యాపకులు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, తొందరలోనే పరిష్కరిస్తుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ కాంట్రాక్టు టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణ గుప్తా, మహత్మాత్మగాంధీ యూనివర్సిటీ నేత నవీన్, కాంట్రాక్టు అధ్యాపకులు యాలాద్రి, సునీత, పిట్ట సరిత, రమాదేవి, నరసయ్య, దిలీప్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
నిధులు విడుదల
చేయకపోతే బహిష్కరిస్తాం
లింగంపేట(ఎల్లారెడ్డి): నిధులు విడుదల చేయని పక్షంలో మార్చి 1 నుంచి విధులు బహిష్కరిస్తామని, గ్రామ పంచాయతీల్లో నిధులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలుపుతూ పంచాయతీ కార్యదర్శులు మండల ప్రత్యేకాధికారి, డీఆర్‌డీవో సురేందర్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంవత్సర కాలంగా పంచాయతీల్లో నిధులు లేక చేతి డబ్బులు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు. లేదంటే కార్యదర్శులు గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉండదన్నారు. అంతకు ముందు ప్రత్యేకాధికారి కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఎంపీడీవో నరేశ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
క్రమబద్ధీకరించి పేస్కేల్ అమలు చేయాలి
కామారెడ్డి టౌన్: సమగ్ర శిక్ష ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పేస్కేల్ అమలు కోసం కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరుతూ గురువారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మంద్ర ప్రధాన్‌ను ఢిల్లీలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కలిసి వినతిపత్రం అందజేసినట్లు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రిని కలిసి తమకు న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. పే స్కేల్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నివేదిస్తే కేంద్రం వాటా 60 శాతం చెల్లిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు సత్యనారాయణ చెప్పారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి
ఉద్యోగ భద్రత కల్పించాలి
Comments
Please login to add a commentAdd a comment