నిరుద్యోగ భృతి ఇచ్చి ఓట్లు అడగాలి
బాన్సువాడ: నిరుద్యోగ భృతి ఇచ్చి నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఓట్లు అడగాలని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ వ్యాఖ్యానించారు. గురువారం బాన్సువాడలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు అడిగే హక్కు లేదని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముందు అమలు చేసి పట్టభద్రులను ఓట్లు అడగాలని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేందర్‌రెడ్డి ముందు ప్రభుత్వం బకాయిపడ్డ ఫీజురియంబర్స్‌మెంట్‌ను విడుదల చేయించాలని అన్నారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. తనను గెలిపిస్తే స్కిల్ డెవలప్‌మెంట్‌ను పెట్టిస్తానని అన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు తనకే వేయాలని పట్టభద్రులను కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు, మాజీ ఎంపీ బీబీ పాటిల్, నాయకులు పెద్దోళ్ల గంగారెడ్డి, పైడి ఎల్లారెడ్డి, చీదరి సాయిలు, శంకర్‌గౌడ్, కోనాల గంగారెడ్డి, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment