అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు
బాన్సువాడ రూరల్: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని బాన్సువాడ ఎమ్మెల్యే, వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి నాగారం గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసి మాట్లాడారు. ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు చేసుకున్న 79 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 4 విడతలుగా రూ.5 లక్షలు బ్యాంకు అకౌంట్‌లో జమ చేస్తుందన్నారు. బేస్ మెంట్ లెవెల్‌కు రూ.లక్ష, లెంటల్ లెవెల్‌కు రూ.లక్ష, స్లాబ్ నిర్మాణం పూర్తయిన తర్వాత రూ.2లక్షలు, మిగితా పనులన్నీ పూర్తయిన తర్వాత రూ.లక్ష చొప్పున ఎలాంటి ట్యాక్సులు లేకుండా చెల్లిస్తుందన్నారు. నాయకులు అంజిరెడ్డి, మోహన్ నాయక్, నార్లసురేష్, ఎంపీడీవో బషీరుద్దీన్, తహసీల్దార్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు
పోచారం శ్రీనివాస్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment