మనిషి ఆలోచనలో మార్పురావాలి
తెయూ (డిచ్‌పల్లి): మనిషి జీవితంలో విజయం సాధించాలంటే తన ఆలోచన విధానంలో మార్పురావాలని యూనివర్సిటీ ఆఫ్ టెక్నిక్స్ ప్రొఫెసర్, అకడమిక్ ఎడ్యుకేషన్ అడ్వయిజర్ డాక్టర్ గడ్డం వాణి అన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో సోమవారంవిద్యార్థుల ఆలోచనలు– అవకాశాలు అనే అంశంపై కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ అధ్యక్షతన విస్తృతోపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గడ్డం వాణి మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో విజయం సాధించాలంటే నిరంతర అధ్యయనం, బహుముఖ విజయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అపజయాలు ఎదురైనప్పుడు అనుభవాలను గుణపాఠాలుగా మార్చుకొని, విజయం కోసం ముందడుగు వేయాలని ఉద్బోధించారు. కార్యక్రమంలో లా కాలేజ్ ప్రిన్సిపల్ ప్రసన్న రాణి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ నాగరాజు, చీఫ్ వార్డెన్ మహేందర్, అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment