ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం
కామారెడ్డి క్రైం: అనధికార లేఅవుట్లు, వ్యక్తిగత ప్లాట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్‌లో మున్సిపల్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, లేఅవుట్లు వేసిన యజమానులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2020 ఆగస్టు 31 నాటికి ముందే అనధికార లేఅవుట్లలో 10 శాతం అమ్మకం జరిగి ఉన్నట్లయితే, మిగతా 90 శాతం ప్లాట్లను ప్రస్తుతం క్రమబద్దీకరించుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం 25 శాతం రిబేటు అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. మార్చి 31, 2025 వరకు మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు. అంతే కాకుండా వ్యక్తిగత ప్లాట్లకు కూడా రాయితీ వర్తిస్తుందన్నారు. అభ్యంతరం లేని ప్లాట్లకు ఈ సౌకర్యం ఉందన్నారు. ప్రభుత్వ భూములు, వక్ఫ్ బోర్డు, ఎండోమెంట్ భూములు, నీటి పారుదల శాఖ భూములు, సీలింగ్ భూములు, శిఖం భూములు, కోర్టు కేసులు ఉన్న పాట్లకు ఈ అవకాశం వర్తించదని వివరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ రమేష్ రెడ్డి, జెడ్పీ సీఈవో చందర్, ఆయా శాఖల అధికారులు, డాక్యుమెంట్ రైటర్లు పాల్గొన్నారు.
ఈ నెల 31 వరకే గడువు
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Comments
Please login to add a commentAdd a comment