వేర్వేరు చోట్ల ముగ్గురి ఆత్మహత్య
బాల్కొండ: ఆర్థిక ఇబ్బందులు తాళలేక మెండోరా మండలం వెల్కటూర్ గ్రామానికి చెందిన చంద్రగిరి వెంకటేశ్‌గౌడ్(39) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెండోరా ఎస్సై నారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటేశ్‌గౌడ్ ఆరు నెలల క్రితం దుబాయి నుంచి ఇంటికి వచ్చి గీత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బతుకుదెరువు కోసం గతంలో మూడుసార్లు దుబాయి వెళ్లగా అక్కడ సరైన పని లభించక తిరిగి వచ్చాడు. దుబాయి వెళ్లినప్పుడల్లా అప్పు చేసి ఏజెంట్లకు డబ్బులు చెల్లించాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఆదివారం వెంకటేశ్‌గౌడ్ భార్య శ్రావణి పిల్లలతో కలిసి తల్లిగారింటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
తాడ్‌బిలోలిలో మరొకరు..
రెంజల్(బోధన్): అనారోగ్యంతోపాటు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన సాకినిగారి పోశెట్టి(55) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు. గత నెల 22న ఇంటి నుంచి వెళ్లిన పోశెట్టి కనిపించకపోవడంతో కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేశారు. సోమవారం స్థానిక చెరువులో మృతదేహం కనిపించడంతో జాలర్లతో బయటకు తీయించారు. అక్కడే శవ పంచనామా, పోస్టుమార్టం నిర్వహించి మృతుడి కుమారుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment