పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల బాసట
బాన్సువాడ రూరల్: బోర్లం జెడ్పీహెచ్‌ఎస్‌లో మౌలిక సౌకర్యాల కల్పనకు పూర్వ విద్యార్థులు బాసటగా నిలిచారు. పాఠశాలలో ప్రస్తుతం 180 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వారి కోసం 60 ఐరన్ బెంచీలు కావాలని ఇటీవల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ ప్రతిపాదన చేశామని తెలిపారు. ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు 15 బెంచీల కోసం విరాళం ఇచ్చి పూర్వవిద్యార్థులు కూడా సాయం అందించాలని వాట్సాప్ గ్రూప్‌లో విజ్ఞప్తి చేశారు. దీంతో పాఠశాల పూర్వ విద్యార్థి పుట్టి ప్రణయ్ రూ.25వేలు, సురంపల్లి నవీన్‌రెడ్డి రూ.20వేలు, 2006–07 పదోతరగతి బ్యాచ్ విద్యార్థులు రూ.8,500, 2007–08 బ్యాచ్ విద్యార్థులు రూ.11వేలు ప్రకటించారు. వీరితో పాటు దామరంచ విఠల్, లింగాల అమరేందర్‌రెడ్డి, బసిరెడ్డి విఠల్‌రెడ్డిలు రూ.8,500 చొప్పున అందజేశారు. అలాగే గొబ్బురు మనోజ్‌రెడ్డి, చిటిమెల్ల నవీన్, కాట్రోత్ ఓంకార్, పీఈటీ అనంద్, గాండ్ల కిరణ్‌లు రూ.5,100 చొప్పున అందజేశారు. అలాగే సుమారు 10 మంది ఒకటి, రెండు చొప్పున బెంచీలకు విరాళాలు ప్రకటించారు. ఇటీవల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణ తన మిత్రబృందంతో సంప్రదించి విద్యార్థులుకు రూ.4 లక్షల విలువైన 10 కంప్యూటర్లు బహూకరించి ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చారు.
ముత్యంపేట పాఠశాలకు బెంచీల అందజేత
దోమకొండ: ముత్యంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు కామారెడ్డికి చెందిన జిజిబాయి దామోదర్‌రావ్ రూ.80 వేల విలువ చేసే బెంచీలను అందజేశారు. హైదరాబాద్ నుంచి బెంచీలను తయారు చేయించి పాఠశాలకు అందజేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment