పోలీసులు ప్రజలకు రక్షణగా ఉండాలి
సుభాష్‌నగర్: నగరంలో చైన్ స్నాచింగ్, వాహనాల దొంగతనాలు, ఇళ్ల చోరీలను అరికట్టి, పోలీసులు ప్రజలకు రక్షణగా నిలవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ విజ్ఞప్తిచేశారు. జిల్లావ్యాప్తంగా సరఫరా అవుతున్న డ్రగ్స్, గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని, యువతను వాటి బారిన పడకుండా కాపాడాలన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సాయి చైతన్యను శనివారం తన ఛాంబర్‌లో ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా సీపీకి మొక్కును అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలో లా అండ్ ఆర్డర్ అదుపు చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ సమస్య, ఫుట్‌పాత్ కబ్జాలు, అక్రమ భూకబ్జాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. జిల్లా అభివృద్ధి, లా అండ్ ఆర్డర్ అదుపు చేయడంలో పోలీస్‌శాఖ తీసుకునే ప్రతి విషయంలో ఎమ్మెల్యేగా తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.
సీపీని కలిసిన బోధన్ సబ్ కలెక్టర్
ఖలీల్‌వాడి: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం నిజామాబాద్ సీపీ సాయి చైతన్యను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాన్ని అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. సబ్ కలెక్టర్‌ను సీపీ స్వాగతిస్తూ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment