న్యాయ వ్యవస్థకు డిజిటల్‌ సొబగులు | - | Sakshi
Sakshi News home page

న్యాయ వ్యవస్థకు డిజిటల్‌ సొబగులు

Published Sun, Mar 16 2025 1:22 AM | Last Updated on Sun, Mar 16 2025 1:19 AM

న్యాయ

న్యాయ వ్యవస్థకు డిజిటల్‌ సొబగులు

న్యాయవ్యవస్థ డిజిటలైజేషన్‌ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే జిల్లాలో ఈ –కోర్ట్స్‌ సర్వీసెస్‌ ప్రారంభమైంది. దీని ద్వారా కేసు స్థితిగతులను ఆన్‌లైన్‌లో తెలుసుకునే వెసులుబాటు న్యాయమూర్తులు, న్యాయవాదులతోపాటు కక్షిదారులకు లభించింది. కేసులకు సంబంధించిన పత్రాల డిజిటలైజేషన్‌ పూర్తి చేసి రికార్డులు, పత్రాలు ఏవి కావాలన్నా ఇట్టే సర్టి ఫైడ్‌ కాపీ ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ–ఫైలింగ్‌ విధానంతో న్యాయ సేవలు మరింత సులభతరం కానున్నాయి. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

ఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025

– 8లో u

సత్వర న్యాయం అందించేందుకు..

ప్రజలకు సత్వర న్యాయం అందించే దిశగా న్యాయవ్యవస్థలో అనేక మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ ద్వారా కేసుల వాయిదాలు, కేసుల స్థితిగతులు తెలుసుకోవడం నుంచి కేసుల ఫైలింగ్‌ ఇంకా అనేక రకాల సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. న్యాయవాదులు తమ కార్యాలయం నుంచే ఈ –ఫైలింగ్‌ ద్వారా కేసును ఫైల్‌ చేసి, వర్చువల్‌ ద్వారా కేసు విచారణల్లో పాల్గొనవచ్చు. కేసుల విచారణ వేగంగా జరగడంతో పాటు ప్రజలకు సత్వర న్యాయం అందుతుంది. కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ అన్ని డిజిటలైజ్‌ అవుతున్నాయి. లైఫ్‌లాంగ్‌ అవి భద్రంగా ఉంటాయి. ఎవరికి ఏది అవసరం అయినా వారికి సర్టిఫైడ్‌ కాపీ సులువుగా పొందే వీలు కలుగుతుంది. ప్రతీది ఆన్‌లైన్‌ ద్వారా జరిగితే పేపర్‌ అవసరం కూడా ఉండదు. లాప్‌టాప్‌లోనే కేసుల వివరాలను చదువుకునేందుకు న్యాయవాదులకు, న్యాయమూర్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో మార్పులు జరిగాయి. త్వరలోనే పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్‌ జరిగి సేవలు మరింత అందుబాటులోకి వస్తాయి.

– డాక్టర్‌ సీహెచ్‌వీఆర్‌ఆర్‌ వరప్రసాద్‌, జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి, కామారెడ్డి

సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటున్న కోర్టులు

ఇప్పటికే అందుబాటులో ఈ –కోర్ట్స్‌ సర్వీసులు

సులభంగా కేసు స్థితి తెలుసుకునేందుకు అవకాశం

ఈ–ఫైలింగ్‌తో మరిన్ని ప్రయోజనాలు..

వర్చువల్‌ విధానంలోనూ విచారణలు

భారతదేశ న్యాయ వ్యవస్థ ఎప్పటికప్పుడు నవ్యత్వాన్ని సంతరించుకుంటోంది. ప్రజలకు న్యాయ సేవలను చేరువ చేయడంతోపాటు పెండింగ్‌లో ఉన్న కేసులను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారు. చట్టపరమైన సేవలు, న్యాయాన్ని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఇప్పటికే ఈ–కోర్టు విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ–కోర్టు అనేది కాగిత రహిత కోర్టు. ఇందులో కోర్టు కార్యకలాపాలన్నీ డిజిటల్‌ ఫార్మాట్‌లో జరుగుతాయి. కేసుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకోవచ్చు. కక్షిదారు తమ కేసు ఏ స్థాయిలో ఉంది, వాయిదా ఎప్పుడు ఉంది అన్న వివరాలు తెలుసుకునే సదుపాయం ఈ విధానం ద్వారా అందుబాటులోకి వచ్చింది.

ఈ–ఫైలింగ్‌..

న్యాయవ్యవస్థలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ–కోర్ట్స్‌ సర్వీసెస్‌ ద్వారా ఎన్నో రకాల సేవలు అందుతున్నాయి. కోర్టు ఇన్ఫర్మేషన్‌ సిస్టం (సీఐఎస్‌) ద్వారా కేసుకు సంబంధించిన వ్యక్తుల ఫోన్‌ నంబర్లు, మెయిల్‌ అడ్రస్‌లు ఇస్తే వారికి మెసేజ్‌లు కూడా వెళతాయి. ఈ –ఫైలింగ్‌ విధానం ద్వారా న్యాయవాది తన ఆఫీసులోనుంచే ఆన్‌లైన్‌లో కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించి కేసును ఫైల్‌ చేయవచ్చు. రాబోయే రోజుల్లో తన కార్యాలయం నుంచే కేసులను వర్చువల్‌ విధానంలో వాదించే అవకాశం కూడా కలగనుంది. ఇప్పటికే కొన్ని కేసుల్లో దూరాన ఉన్న వారితో వర్చువల్‌ పద్ధతుల్లో విచారణ చేస్తున్నారు. కామారెడ్డి నుంచి కొందరు న్యాయవాదులు హైకోర్టులో ఉన్న కేసులకు సంబంధించి వర్చువల్‌ పద్ధతిలో హాజరవుతున్నారు. అలాగే ఇక్కడి కేసులకు సంబంధించిన సాక్షులు విదేశాల్లో ఉన్నపుడు కేసును పరిష్కరించే ఉద్దేశంతో న్యాయవాదులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా వారి వాంగ్మూలం రికార్డు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్‌ జరిగితే మరింతగా సేవలు మెరుగుపడనున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టుల సముదాయంలో ఈ –సేవా కేంద్రం కూడా ఏర్పాటైంది. దీని ద్వారా పన్నెండు రకాల సేవలు అందించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే కొన్ని సేవలు అందుతున్నాయి.

త్వరలో కేసు పత్రాల డిజిటలైజేషన్‌

న్యూస్‌రీల్‌

మార్పు మంచిదే...

మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవలసిన అవసరం ఉంది. పనులు వేగంగా జరగాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాల్సిందే.. ఆ దిశగా న్యాయవ్యవస్థలో మార్పులు వస్తుండడం ఆహ్వానించదగ్గ పరిణామమే. ఈ విధానాలపై న్యాయవాదులు, కక్షిదారులకు అవగాహన కల్పించాలి.

– శ్రీకాంత్‌గౌడ్‌, బార్‌ అసోసియేషన్‌

అధ్యక్షుడు, కామారెడ్డి

కోర్టుల్లో గుట్టల్లా పెరిగిపోతున్న కేసులకు సంబంధించి రికార్డులను కాపాడడం కూడా న్యాయస్థానాలకు పెద్ద సవాల్‌గా మారింది. దశాబ్దాలుగా పేరుకుపోయిన కేసుల ఫైళ్లకు చెదలు పట్టడమో, తడితో చెడిపోవడమో జరుగుతోంది. ఒక్కోసారి ముఖ్యమైన ఫైల్స్‌ కూడా దెబ్బతింటున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు ఆయా కేసులకు సంబంధించిన రికార్డులన్నింటినీ డిజిటలైజేషన్‌ చేసే ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే కేసుకు సంబంధించిన రికార్డులు, పత్రాలు ఏవి కావాలనుకున్నా ఇట్టే సర్టిఫైడ్‌ కాపీ ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది. కేసుల వివరాలన్నీ డిజిటలైజ్‌ అయ్యాక న్యాయవాదులు, న్యాయమూర్తులు ఎప్పుడంటే అప్పుడు ల్యాప్‌టాప్‌లో చదువుకునే వీలు కలుగుతుందని కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ సీహెచ్‌వీఆర్‌ఆర్‌ వరప్రసాద్‌ ‘సాక్షి’తో పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో 16,500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కేసుల వివరాలను డిజిటలైజ్‌ చేసి ఆన్‌లైన్‌లో భద్రపరిస్తే వంద ఏళ్లయినా భద్రంగా ఉంటాయని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
న్యాయ వ్యవస్థకు డిజిటల్‌ సొబగులు1
1/4

న్యాయ వ్యవస్థకు డిజిటల్‌ సొబగులు

న్యాయ వ్యవస్థకు డిజిటల్‌ సొబగులు2
2/4

న్యాయ వ్యవస్థకు డిజిటల్‌ సొబగులు

న్యాయ వ్యవస్థకు డిజిటల్‌ సొబగులు3
3/4

న్యాయ వ్యవస్థకు డిజిటల్‌ సొబగులు

న్యాయ వ్యవస్థకు డిజిటల్‌ సొబగులు4
4/4

న్యాయ వ్యవస్థకు డిజిటల్‌ సొబగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement