విద్యాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
నిజాంసాగర్: విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కోరారు. శనివారం అచ్చంపేట జిల్లా పరిషత్ హైస్కూల్‌లో కృత్రిమ మేధ సాయంతో విద్యాబోధనకు సంబంధించిన కంప్యూటర్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాబోధనలో ప్రాథమిక స్థాయినుంచే విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తోందన్నారు. పేద పిల్లలకూ కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల్లో వెనకబడిన విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేలా బోధించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటోందన్నారు.
సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి
ఉపాధి హామీ పథకంలో మొదటి రెండు విడుతల్లో వచ్చిన నిధులతో చేపట్టిన సిమెంట్ రోడ్ల నిర్మాణాలను ఈనెలాఖరు నాటికి పూర్తి చేయించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మార్చి నెలాఖరు వరకు సీసీ రోడ్లు పూర్తి చేసేలా చూడాలని చెప్పారు. ఆయన వెంట బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీవోలు గంగాధర్, అనిత, ఎంఈవోలు తిరుపతిరెడ్డి, అమర్‌సింగ్, ఎస్సై శివకుమార్, ప్రధానోపాధ్యాయులు వెంకట్రాంరెడ్డి, లాల్‌సింగ్ తదితరులు ఉన్నారు.
మండలానికి 3 యూనిట్లు
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
అచ్చంపేటలో ఏఐ పాఠాలు ప్రారంభం
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ నిజాంసాగర్‌లోని నిజాంసాగర్ పల్లె ప్రకృతి వనం, మోడల్ ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్ సరఫరాకు ఐకేపీ ఆధ్వర్యంలో మండలానికి మూడు యూనిట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మండలంలో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో సిమెంట్ ఇటుకల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. తక్కువ ఖర్చుతో మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సిద్ధంగా ఉండాలన్నారు. గ్రామాలవారీగా వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై విచారణ చేపట్టి క్షేత్రస్థాయిలో అనుమతులు ఇవ్వాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖస్తులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు.
విద్యాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
Comments
Please login to add a commentAdd a comment