సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
కామారెడ్డి క్రైం: పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ స్పెషల్ పార్టీ, ఎంటీ సెక్షన్, ఎస్కార్ట్, బీడీ టీమ్స్, డాగ్ స్క్వాడ్, ఏఆర్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధులను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు తమ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై కూడా సిబ్బంది దృష్టి పెట్టాలన్నారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ రోజూ వ్యాయామం, యోగా చేయాలని సూచించారు. చిత్తశుద్ధితో విధులు నిర్వహించి ప్రజలలో పోలీస్ శాఖకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచాలన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్, లోన్ యాప్స్ జోలికి వెళ్లవద్దని సూచించారు. క్రమశిక్షణతో, మంచిప్రవర్తనతో విధులు నిర్వర్తించినప్పుడు అదికారులు అన్నిరకాలుగా అండగా ఉంటారని పేర్కొన్నారు.
సమర్థవంతంగా విధులు నిర్వహించాలి
‘దర్బార్’లో ఎస్పీ రాజేశ్ చంద్ర
Comments
Please login to add a commentAdd a comment