ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలి
పిట్లం: విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శనివారం ఆయన పిట్లంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి, వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రాన్ని సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. మండలంలో ల్యాండ్ రెగ్యులరైజేషన్ పురోగతిని, వసూలైన ఫీజు వివరాలను తెలుసుకున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ సౌకర్యం గురించి దరఖాస్తుదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి వామన్‌రావు, హౌసింగ్ పీడీ విజయ్‌పాల్‌రెడ్డి, ఇన్‌చార్జి తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో కమలాకర్, ఎంఈవో దేవీ సింగ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment