పెద్దకొడప్‌ల్(జుక్కల్): పంట చేతికొచ్చినా తెల్ల జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకాకపోవడంపై ‘దళారులే దిక్కు..!’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మహేశ్ కుమార్ స్పందించారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, ఆదేశాలు అందగానే ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఎంపీవో, సెక్రెటరీకి మెమోలు
గాంధారి(ఎల్లారెడ్డి): జిల్లాలో తాగునీటి సమస్యలపై ‘సాక్షి’లో ‘గొంతు తడిసేదెలా?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. తాగు నీటి సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో గాంధారి ఎంపీవో లక్ష్మీనారాయణ, సోమ్లానాయక్ తండా పంచాయతీ కార్యదర్శి దేవీసింగ్‌కు కలెక్టర్ మెమోలు జారీ చేసినట్లు ఎంపీడీవో రాజేశ్వర్ తెలిపారు. సోమ్లానాయక్ తండాను అధికారులు సోమవారం సందర్శించి విచారణ చేపట్టారు. పరిస్థితులను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికను అందజేశారు.