
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
మద్నూర్/బిచ్కుంద(జుక్కల్) : మండలంలోని సలాబత్‌పూర్ హనుమాన్ ఆలయంలో ఆదివారం నిర్వహించిన సీతారాముల కల్యాణ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బిచ్కుంద రామాలయంలో ఎమ్మెల్యే పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కోట్ల నిధులు మంజూరు చేస్తోందన్నారు. సలాబత్‌పూర్ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 70 కోట్లు మంజూరు చేసిందన్నారు. బండయప్ప మఠం పీఠాధిపతి శ్రీ సోమయప్ప స్వామి ఆద్వర్యంలో నిర్వహించిన సీతారాముల కల్యాణంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ సింధే, అరుణతార పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సోమయప్ప స్వామి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
రాములోరికి పట్టు వస్త్రాలు
సమర్పించిన ఎమ్మెల్యే తోట