శ్రీకాంత్ రెడ్డి (ఫైల్)
సైదాపూర్: అదృశ్యమైన ఓ వ్యక్తి వ్యవసాయ బావిలో శవమై తేలాడు. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లికి చెందిన కొట్టె శ్రీకాంత్‌రెడ్డి(34) భార్య ప్రణీత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె పిల్లలతో కలిసి తన పట్టింటికి వెళ్లింది.
శ్రీకాంత్‌రెడ్డి సోమవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. రాత్రయినా తిరిగి రాలేదు. అయితే, అతను కనిపించడం లేదని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెన్నంపల్లికి చెందిన రైతు ప్రభాకర్‌రెడ్డి మంగళవారం తన వ్యవసాయ బావిలో నీళ్లు ఏ మేరకు ఉన్నాయోనని తొంగి చూశాడు. అతనికి అందులో శ్రీకాంత్‌రెడ్డి మృతదేహం కనిపించింది.
పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని బయటికి తీయించారు. బహిర్భూమికి వెళ్లి, ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు మృతుడి భార్య ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఆరోగ్యం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment