‘వందేభారత్’కు స్పందన
రామగుండం: నాగ్‌పూర్ – సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ రైలుకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోందని రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. ఈనెల 16న వందేభారత్ ప్రారంభమైన విషయం విదితమే. నాగపూర్–సికింద్రాబాద్ వైపు (రైలు నంబరు 20101) ఉదయం 5గంటలకు నగ్‌పూర్‌లో బయలుదేరుతుందన్నారు. ఉదయం 5.43 గంటలకు సేవాగ్రామ్, 7.03 గంటలకు చంద్రాపూర్, 7.20 గంటలకు బల్హార్షా, 9.08గంటలకు రామగుండం, 10.04 గంటలకు కాజీపేట, మధ్యాహ్నం 12.15గంలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని వివరించారు. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి నాగపూర్ వైపు(రైలు నంబరు 20102) మధ్యాహ్నం ఒంట గంటకు బయలుదేరి మధ్యాహ్నం 2.28గంటలకు కాజిపేట జంక్షన్, మధ్యాహ్నం 3.23 గంటలకు రామగుండం, సాయంత్రం 5.25 బల్హర్షా, సాయంత్రం 5.33 గంటలకు చంద్రాపూర్, రాత్రి 7.03 గంటలకు సేవాగ్రామ్, రాత్రి 8.20 గంటలకు నాగపూర్ చేరుకుంటుందన్నారు. సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ల మాదిరిగానే రిజర్వేషన్ సౌకర్యం ఉందని, సీట్లు పూర్తిస్తాయిలో భర్తీ కాకుంటే నిర్దేశిత సమయానికి 30 నిమిషాల ముందు రైల్వేస్టేషన్‌లో నేరుగా టికెట్ తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. కరెంట్ బుకింగ్‌లో పదిశాతం రాయితీ వర్తింజేస్తున్నామన్నారు. చైర్‌కార్, ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ విభాగాల్లో టికెట్లు జారీ చేస్తారరని పేర్కొన్నారు. ప్రస్తుతం రామగుండం నుంచి సికింద్రాబాద్‌కు రిజర్వేషన్‌లో విత్ ఫుడ్ చైర్‌కార్(సీసీ) రూ.765, వితౌట్ ఫుడ్ రూ.665, ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్(ఈసీ) రూ.1,420 టికెట్ ధర ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment