
విద్యార్థులు నిరంతరం నేర్చుకోవాలి
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్: విద్యార్థులు క్రమశిక్షణతో నేర్చుకుంటూ తమకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకునేలా ముందుకు సాగాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సప్తగిరికాలనీ జెడ్పీ ఉన్నత పాఠశాలలో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ నిర్వాహకులు 8 కంప్యూటర్లతో ఏర్పా టు చేసిన ల్యాబ్‌ను ప్రారంభించారు. సమగ్ర శిక్ష కో– ఆర్డినేటర్ అశోక్, హెచ్‌ఎం రాజేందర్, ఫౌండేషన్ సభ్యులు సూర్య, వంశీ పాల్గొన్నారు.
‘నులి’ నివారణ మాత్రలు అందించాలి
కరీంనగర్‌టౌన్: ఫిబ్రవరి 10న నులిపురుగుల దినోత్సవం పురస్కరించుకుని ఒకటి నుంచి 19 ఏళ్ల లోపు వారందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు ఇవ్వాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలు లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి జిల్లా వైద్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలో చదివే విద్యార్థులతో పాటు వలస కూలీల పిల్లలకు మాత్రలు అందించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment