సిరిసిల్లకల్చరల్: బాల సాహిత్యకారిణి, డాక్టర్ కందేపి రాణీప్రసాద్‌కు మరో పురస్కారం వరించింది. తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సీతాస్ చారిటబుల్ ట్రస్టు, అభిజ్ఞ భారతి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన జాతీయ సాహిత్య సదస్సులో ‘ఆ తరం రచయిత్రుల జీవన ప్రస్థానంపై ఈ తరం రచయిత్రుల పత్ర సమర్పణలు’ కార్యక్రమం నిర్వహించారు. రాణీప్రసాద్ తన మాతృమూర్తి అంగలకుదుటి గోవిందమ్మ సాహిత్య కృషి తన పత్ర సమర్పణ చేశారు. అనంతరం వంశపారంపర్య సాహిత్య పురస్కారాన్ని రాణీప్రసాద్‌కు ప్రదానం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 మందికి పురస్కారాలు అందించగా మన జిల్లా నుంచి ఈ పురస్కారం అందుకున్న వ్యక్తి రాణీప్రసాద్ కావడం జిల్లా సాహిత్య రంగానికి గర్వకారణం అని పలువురు సాహితీవేత్తలు ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment