● జనరల్ అసిస్టెంట్లుగా కార్మికులు ● జనరల్ మజ్దూర్ హో
గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో పనిచేస్తున్న సుమారు 23 వేల మంది జనరల్ మజ్దూర్ కార్మికులకు మంచి హోదా కల్పిస్తూ కోలిండియా యాజమాన్యం ఇటీవల ఉత్తర్వులు జారీచేయడంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. దాదాపు పదేళ్ల నాటి జనరల్ మజ్దూర్ డిజిగ్నేషన్‌కు స్వస్తి పలికి గౌరవ డిజిగ్నేషన్ ఇవ్వాలని జాతీయ కార్మిక సంఘాలు డిమాండ్ ఎట్టకేలకు వీరి ఫలించింది. జాతీయ కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు ఈఏడాది ఫిబ్రవరి–28న జనరల్ మజ్దూర్లను జనరల్ అసిస్టెంట్లుగా మార్పుచేస్తూ కోలిండియా యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. మార్చి 1 నుంచి ఈ ఆదేశాలు అమలు చేయాలని సూచించింది.
తొలుత బదిలీ వర్కర్‌గా..
సింగరేణి సంస్థలో తొలుత ఉద్యోగంలో చేరిన కార్మికులు బదిలీ వర్కర్లుగా పనిచేసేవారు. ఏడాదిలో నిర్ణీత మస్టర్లు పూర్తిచేస్తేనే జనరల్ మజ్దూర్లుగా పదోన్నతి లభించేది. యాజమాన్యం. చాలామంది కార్మికులు జనరల్ మజ్దూర్ల హోదాతోనే ఉద్యోగ విరమణ చేసిన వారూ ఉన్నారు. వేతనం, జీవితం బాగానే ఉన్నా హోదా విషయంలో మాత్రం చాలామంది కార్మికులు ఇబ్బంది పడేవారు. కోలిండియా యాజమాన్యం ఉత్తర్వులతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న జనరల్ మజ్దూర్ డిజిగ్నేషన్ కోలిండియాలోని అన్ని సంస్థల్లో కనుమరుగు కానుంది. దీనిస్థానంలో జనరల్ అసిస్టెంట్‌గా డిజిగ్నేషన్ వచ్చి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment