శ్రీపాదరావు ఆశయాలు నెరవేరుస్తున్న శ్రీధర్‌బాబు
కరీంనగర్‌కార్పొరేషన్: శాసనసభ మాజీ స్పీకర్, స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు ఆశయాలు కొనసాగిస్తూ తండ్రికి తగిన తనయుడుగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నిలుస్తున్నారని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం శ్రీపాదరావు జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహించింది. శ్రీపాదరావు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి జీవన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై శ్రీపాదరావు విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1983, 1989లో ఎమ్మెల్యేగా శ్రీపాదరావుతో కలిసి పనిచేసే అదృష్టం తనకు దక్కిందని గుర్తు చేసుకున్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం, నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్, నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment