దంపతులను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
మెట్‌పల్లి: బంధువుల శుభకా ర్యం కోసం దంపతులిద్దరూ ద్విచక్ర వాహనంపై ఆనందంగా బయలుదేరారు. మార్గంమధ్యలో ఆర్టీసీ బస్సు రూపంలో వారిని ప్రమాదం కబళించింది. ఈ సంఘటనలో భర్త అక్కడికక్కడే మరణించగా.. భార్య తీ వ్రంగా గాయపడింది. సీఐ నిరంజన్‌రెడ్డి కథనం ప్ర కారం.. కోరుట్ల మండలం యెఖీన్‌పూర్‌కు చెందిన రైతు జోడి నర్సారెడ్డికి భార్య అనసూయ, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఆదివారం వేంపల్లిలోని బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండగా ఉదయం భార్యతో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మెట్‌పల్లి శివారుకు చేరుకోగానే ఎదురుగా అతివేగంగా వస్తు న్న ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు కింద పడిన నర్సారెడ్డికి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అనసూయ తీవ్రంగా గాయపడడంతో మొదట స్థానిక ఆసుపత్రికి..ఆ త ర్వాత మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్ డ్రైవర్ గు ర్రం రాకేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. సంఘటన స్థలా న్ని సీఐ పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
భర్త అక్కడికక్కడే మృతి
భార్య పరిస్థితి విషమం
Comments
Please login to add a commentAdd a comment