ఎములాడ రాజన్నకు తగ్గని రద్దీ
వేములవాడ: వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ముగిసినప్పటికీ ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి 30 వేల మంది భక్తులు తరలివచ్చారు. ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీకి సరిపడా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల ద్వారా రూ. 28 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
6న హుండీ లెక్కింపు
మహా జాతరలో భక్తులు హుండీల్లో వేసిన కట్నాలు, కానుకలను ఈనెల 6న లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లెక్కింపులో ఆలయ అధికారులు, సిబ్బంది, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు, సభ్యులు పాల్గొనాలని ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈసారి రూ కోటికిపైగా హుండీ ఆదాయం వస్తుందన్న భావనలో అధికార యంత్రాంగం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment