రాష్ట్ర జూడో సంఘం చైర్మన్‌గా బండ ప్రకాశ్
కరీంనగర్‌స్పోర్ట్స్: రాష్ట్ర జూడో సంఘం చైర్మన్‌గా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2025–29 సంవత్సరాలకు గాను తెలంగాణ జూడో సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు బుధవారం కరీంనగర్‌లోని హోటల్ మైత్రిలో నిర్వహించారు. ముందుగా జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించి తదనంతరం ఎన్నికలను ఎన్నికల అధికారి ఎన్.పరమేశ్వర్ నిర్వహించారు. నూతన కార్యవర్గం ఎన్నికలకు జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి పరిశీలకులుగా జాయ్ వర్గీస్ తెలంగాణ ఒలింపిక్ సంఘం నుంచి పి.మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికారిక సంస్థ నుంచి వి.శ్రీనివాస్ హాజరయ్యారు. నాలుగేళ్లపాటు నూతనంగా ఎన్నికై న కార్యవర్గం పనిచేస్తుందని ఎన్నికల అధికారి ఎన్.పరమేశ్వర్ ప్రకటించారు. తెలంగాణ జూడో సంఘం అధ్యక్షుడిగా వరంగల్ జిల్లాకు చెందిన బండ రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్‌కు చెందిన గసిరెడ్డి జనార్దన్‌న్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కడారి అనంతరెడ్డి(కరీంనగర్), పబ్బతి బాలరాజు(యాదాద్రి భువనగిరి), బాదినేని రాజేందర్‌రెడ్డి(జగిత్యాల), మాటేటీ సంజీవ్‌కుమార్(పెద్దపల్లి), సంయుక్త కార్యదర్శులుగా రాయిరెడ్డి శంకర్‌రెడ్డి(సిద్దిపేట), సిలివేరి మహేందర్(పెద్దపల్లి), తిప్పారపు సత్యనారాయణ(రాజన్న సిరిసిల్ల), చందనగిరి నాగరాజు(వరంగల్), ట్రెజరర్‌గా రాయిరెడ్డి మహేందర్‌రెడ్డి(సిద్దిపేట), కార్యవర్గ సభ్యులుగా ఎ.సాయిచరణ్(ఆదిలాబాద్), వై.సాయికిరణ్(నిర్మల్), కె.తిరుపతిగౌడ్(రాజన్నసిరిసిల్ల), కె.రాకేశ్(ఆసిఫాబాద్), ఎ.రమేశ్‌రెడ్డి(మంచిర్యాల), ఎం.శ్రీనివాస్(జగిత్యాల) ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అదే విదంగా ఎన్నికై న నూతన కార్యవర్గాన్ని తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ శాలువాలు, పూల బొకేలతో సత్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ జూడో సంఘం చైర్మన్ బండ ప్రకాశ్ మాట్లాడుతూ తెలంగాణలో క్రీడారంగం దినదినాభివృద్ధి చెందుతున్నదని అందులో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా గ్రామ గ్రామాన జూడో క్రీడకు విశేష ఆదరణ తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ జూడో సంఘం అధ్యక్ష కార్యదర్శులు బండ రాజ్ కుమార్, గసిరెడ్డి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ జూడో క్రీడల్లో అత్యుత్తమంగా శిక్షణ కార్యక్రమాలు జరిగేలా త్వరలోనే అకాడమీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జూడో సంఘం ఉపాధ్యాక్షులు, మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, రాజేందర్ రెడ్డి, మాటేటి సంజీవ్ కుమార్, కోశాధికారి ఆర్ మహేందర్ రెడ్డి, తో వివిధ జిల్లాల నుంచి హాజరైన అధ్యక్ష కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
అధ్యక్ష, కార్యదర్శులుగా రాజ్‌కుమార్, జనార్దన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment