గంజాయి విక్రేతల అరెస్ట్
జగిత్యాలక్రైం: గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన రెండు కేసుల్లో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. జగిత్యాల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లిలో రూరల్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా గాంధీనగర్‌కు చెందిన మానుక కులదీప్, గుట్రాజ్‌పల్లికి చెందిన బొక్కెనపల్లి పవన్‌కుమార్, జిల్లాకేంద్రానికి చెందిన మగ్గిడి రాకేశ్ 130 గ్రాముల గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు. వారి నుంచి మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. రఘురాములకోట శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న జగిత్యాల అరవింద్‌నగర్‌కు చెందిన కోరెపు సాయివినయ్, మార్కండేయనగర్‌కు చెందిన అనుమండ్ల లోకేశ్‌కుమార్‌ను పట్టుకుని వారి నుంచి 1211 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు. సీఐ కృష్ణారెడ్డి, ఎస్సై సదాకర్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, ఉమర్, మోహన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment