చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
● సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్
రామడుగు(చొప్పదండి): విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికారి కె. వెంకటేశ్ సూచించారు. రామడుగు మండలంలోని వెలిచాల జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలను వాడొద్దన్నారు. మొబైల్ కోర్టు న్యాయమూర్తి సరళరేఖ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే కష్టపడి చదివి ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై వి.శేఖర్, హెచ్‌ఎం కన్నం రమేశ్, న్యాయవాదులు రేణుక, గాదె నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం
● రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్
విద్యానగర్(కరీంనగర్): సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ పేర్కొన్నారు. కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో బుధవారం మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణ ఆచరణలోకి తెచ్చి ముస్లిం రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించిందన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి 11వేల పైచిలుకు ఉపాధ్యాయ ఉద్యోగాలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయడం జరిగిందన్నారు. కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి గెలుపు సామాజిక న్యాయం, రాజ్యాంగ స్ఫూర్తికి విజయమన్నారు. నిరుద్యోగులు, మేధావులు, పట్టభద్రులు, ప్రజాస్వామ్యవాదులు నరేందర్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
కమ్యూనిస్టులే
ప్రశ్నించే గొంతుకలు
● సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు
చాడ వెంకట్‌రెడ్డి
శంకరపట్నం: వార్డు నుంచి ఢిల్లీ వరకు జరిగే ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులు విజయం సాధించేందుకు కార్యకర్తలు గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం కేశవపట్నంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కొందరు ప్రజాప్రతినిధులు రాజ్యాంగాన్ని మార్చాలంటూ మాట్లాడం సరికాదన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీకే మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, మండల కార్యదర్శి సమ్మయ్య, అశోక్, కేదారి, సురేశ్, మణికంఠరెడ్డి, యుగేందర్, బుచ్చన్నయాదవ్, సాగర్, సదానందం, రవి, తిరుపతి, రామస్వామి, రాజేశ్వరి, రమాదేవి, రజిత పాల్గొన్నారు.
హామీలు నెరవేర్చాలి
కరీంనగర్: ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ బుధవారం జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ కనకం కుమారస్వామి ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డికి పోస్టుకార్డులు పంపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు, పెన్షన్ రూ.25 వేలు, గుర్తింపు కార్డులు, బస్సు, రైల్ పాసులు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. టౌన్ మహిళా అధ్యక్షురాలు కారుపకాల మున్నా, పట్టణ అధ్యక్షుడు గోడిశాల రమేశ్, ఆకాశ్, వంకర్, మొగిలి, అంజలి, హసినా, గౌరి, రాజేశ్వరి, విజయ, మల్లేశం, విజయభాస్కర్, రమేశ్, గరిగె కోటేశ్వర్ పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment