యూరియా కోసం తిప్పలు
కరీంనగర్‌రూరల్: కరీంనగర్, దుర్శేడ్ ప్రాథమిక సహకార సంఘాల్లో యూరియా లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువారం దుర్శేడ్ సహకార సంఘానికి 20 టన్నుల యూరియా స్టాక్ రావడంతో రైతులు పెద్దసంఖ్యలో బారులు తీరారు. ఒక్కోరైతుకు 3 నుంచి 5 బస్తాల వరకు విక్రయించడంతో రెండుగంటల్లోనే స్టాక్ ఖాళీ అయ్యింది. ఆలస్యంగా వచ్చిన రైతులకు యూరియా లభించకపోవడంతో నిరాశగా వెళ్లిపోయారు. కరీంనగర్, దుర్శేడ్ సొసైటీల ఎరువుల స్టాక్‌ను పరిశీ లించిన ఏవో సత్యం ఇండెంట్‌ను మార్క్‌ఫెడ్ అధికారులకు పంపించారు. యాసంగికి 1,170 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటివరకు 560టన్నులు వచ్చినట్లు ఏవో తెలిపారు. దుర్శేడ్ సొసైటీకి 40టన్నులు, చెర్లభూత్కూర్‌కు 20, బొమ్మకల్‌కు 10, తీగలగుట్టపల్లికు 10, నగునూరుకు 10 టన్నుల చొప్పున శుక్రవారం స్టాక్ వస్తుందన్నారు.
ఏఆర్ పోలీసులకు ముగిసిన శిక్షణ
కరీంనగర్‌క్రైం: ఏటా ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులకు శిక్షణలో భాగంగా నిర్వహించే వార్షిక మొబిలైజేషన్ కార్యక్రమం గురువారం ముగి సింది. కరీంనగర్ పోలీసు కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్‌లో సాయుధ బలగాలు పరేడ్ నిర్వహించారు. అడిషనల్ డీసీపీ ఏ.లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు అదుపుచేసేందుకు ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసుల సేవలు వినియోగించుకుంటాని తెలి పారు. సాయుధ బలగాలలకు ఆర్మ్‌డ్రిల్, వెపన్‌డ్రిల్, పరేడ్, మాబ్ ఆపరేషన్, ఫైరింగ్ అంశాల్లో 20రోజుల పాటు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. రిజర్వు ఇన్స్‌పెక్టర్లు రజనీకాంత్, జానీమియా, శ్రీధర్‌రెడ్డి, సురేశ్ పాల్గొన్నారు.
వైద్య శిబిరాల సందర్శన
కరీంనగర్‌టౌన్: ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా పట్టణ ఆరోగ్య కేంద్రాలైన సప్తగిరికాలనీ, కాశ్మీర్‌గడ్డ, కట్టరాంపూర్‌లోని చైతన్యక్లబ్‌లో మహిళల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.వెంకటరమణ గురువారం సందర్శించారు. శిబిరానికి హాజరైన మహిళలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
‘సునీల్‌రావు ఊసరవెల్లి’
కరీంనగర్ కార్పొరేషన్: ఊసరవెల్లి కన్నా వేగంగా రంగులు మార్చే మాజీ మేయర్ సునీల్‌రావు ఓ రాజకీయ వ్యభిచారి అని సుడా చైర్మ న్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం నగరంలోని సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడు తూ.. మొన్నటి వరకు బండి సంజయ్‌ని విమర్శించి, కండువా రంగు మార్చగానే స్మార్ట్‌సిటీ ప్రదాత సంజయ్ అంటూ పొగడడం సిగ్గుచేటన్నారు. మర్రి చెట్టు లాంటి సంజయ్ నీడన ఊసరవెల్లి సునీల్‌రావు ఎదగలేడని ఎద్దేవా చేశారు. సంజయ్‌పై విమర్శలు చేస్తే కౌంటర్ ఇవ్వడానికి ఆ పార్టీ నాయకులు ఒక్కరు కూడా ముందుకు రాలేదని, నిత్యం కండువాలు మార్చే సునీల్‌రావు మాట్లాడం ఆ పార్టీ పరిస్థితికి నిదర్శనమన్నారు.నాయకులు ఎండీ.తాజ్, మంద నగేశ్ ముదిరాజ్, ఖమర్మ, హమ్మద్ ఆమెర్, జూపాక సుదర్శన్ పాల్గొన్నారు.
22న సంచార పుస్తక ప్రదర్శన
కరీంనగర్‌సిటీ: జిల్లాకేంద్రంలోని ఎస్సారార్ కళాశాలలో శనివారం ఉదయం 10గంటలకు సంచార పుస్తక ప్రదర్శన ఉంటుందని తెలుగుశాఖ అధ్యక్షుడు బూర్ల చంద్రశేఖర్ తెలిపారు. సంచార పుస్తక పరిక్రమలో భాగంగా ఈనెల 21 నుంచి 23వ తేదీల్లో జిల్లాలోని వివిధ పాఠశాలలు, కూడళ్లలో ప్రదర్శన వాహనం ఉంటుందని పేర్కొన్నారు.
యూరియా కోసం తిప్పలు
యూరియా కోసం తిప్పలు
యూరియా కోసం తిప్పలు
Comments
Please login to add a commentAdd a comment