ఏసీబీకి చిక్కిన ల్యాండ్ సర్వేయర్
మంథని: భూ సర్వే కోసం డబ్బులు డిమాండ్ చేసిన ల్యాండ్ సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా గురువారం పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాలు.. మంథని మండల రెవెన్యూ కార్యాలయంలో సర్వేయర్‌గా పని చేస్తున్న జాటోతు గణేశ్‌శ్ రెవెన్యూ గ్రామ శివారులోని రెడ్డి చెరువు వద్ద 814 /డి /1, 815/సి సర్వే నంబర్లలో ఎకరం భూ మిని కొలిచి రిపోర్టు ఇచ్చేందుకు మంథనికి చెందిన రైతు సువర్ణ క్రాంతినాగ్‌ను రూ.17 వేలు డిమాండ్ చేశారు. ఈ నెల 5న రూ.9 వేలు తీసుకున్నాడు. మిగిలిన డబ్బు డిమాండ్ చే యడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించా డు. మరో రూ.3వేలు రెండో వాయిదాగా గురువారం ఇస్తానని ఫోన్ చేయగా, సర్వేయర్ ఆఫీసుకు కాకుండా బస్టాండ్‌కు రావాలని బాధితుడికి చెప్పా డు. దీంతో బాధితు డు రూ.3 వేలు బస్టా ండ్‌లో సర్వేయర్ గణేశ్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ప ట్టుకున్నారు. అనంత రం రెవెన్యూ కార్యాలయంలో విచారణ జరిపి, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు. ఏసీబీ సీఐలు తిరుపతి, కృష్ణకుమార్, హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్, కానిస్టేబుల్ శ్రీకాంత్, హోంగార్డులు అశోక్, సంతోష్ ఉన్నారు.
భూ సర్వేకు రూ.20 వేలు డిమాండ్
రూ.3 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment