ఒడిశా టు మహారాష్ట్ర
గోదావరిఖని: గంజాయి రాష్ట్రాల సరిహద్దులు దాటుతోంది.. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి మహారాష్ట్రకు తరలివెళ్తోంది. సీలేరు నదీతీరం నుంచి మంచిర్యాలకు రవాణా అవుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా రవాణా ఆగడంలేదు. ఉజ్వల భవిష్యత్ ఉన్న యువత గంజాయి మత్తులో జోగుతోంది. కోవర్ట్‌లు ఇచ్చిన సమాచారంతో రామగుండం కమిషనరేట్ పోలీసులు ఒకేరోజు రూ.60లక్షల విలువైన 120కిలోల గంజాయి పట్టుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
కాపుకాసి 96 కిలోలు పట్టివేత
ఒడిశా సరిహద్దుల నుంచి మంథని మీదుగా గంజాయి రవాణా అవుతున్న సమాచారం పోలీసులకు చేరింది. రంగంలోకి దిగగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు జీడీకే–11గని వద్ద మాటు వేశారు. ఈక్రమంలోనే రెండు వాహనా అక్కడకు రాగానే ఆపి తనిఖీ చేశారు. దీంతో అందులో గంజాయి ప్యాకెట్లు లభించాయి. నిందితులతో పాటు గంజాయి, రెండు కార్లను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరు పర్చారు.
సీసీ కెమెరాల ముసుగులో దందా..
ఒడిశా, ఆంధ్రా సరిద్దుల్లో సీలేరు నది ప్రవహిస్తోంది. దాని పరీవాహక ప్రాంతంలోని ఒడిశా అటవీప్రాంతంలో గంజాయి సాగుచేస్తూ ఇతర ప్రాంతాలకు తరలించడం కొన్నేళ్లుగా సాగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఈక్రమంలో మంచిర్యాలకు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే కారు వెంట రెండు మోటార్ సైకిళ్లు ఎస్కార్ట్‌గా రాగా ఒడిశా సీలేరు టు బీజాపూర్, మేడారం, మంథని, గోదావరిఖని మీదుగా మంచిర్యాలకు గంజాయి తరలించారు. సీసీ కెమెరాలు విక్రయించే గోడౌన్‌లో దానిని దాచి ఉంచారు. తీసుకొచ్చింది 30 కిలోల గంజాయిలో 6.5 కిలోలు వినియోగం కాగా మిగతాదానిని మంచిర్యాల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులంతా యువకులే..
తక్కువ డబ్బుతో ఎక్కువ మత్తు వస్తున్న గంజాయి వైపు యువత మొగ్గు చూపుతోంది. ఈక్రమంలో చాలామంది గంజాయి మత్తులో జోగుతూ తమ లక్ష్యాలు, ఉన్నత చదువులను వదిలేస్తున్నారు. మంచిర్యాల గోడౌన్‌లో గంజాయి దాచిఉంచిన సంఘటనలో 11మంది పోలీసులకు పట్టుబడగా వారిలో 25ఏళ్ల వారే ఎక్కువగా ఉన్నారు. అలాగే ఇంకా పోలీసులకు చిక్కని 11మందిలో కూడా యువకులు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. వీరిలో ఒకరు మైనర్ కూడా ఉన్నారని అంటున్నారు.
సీలేరు నుంచి మంచిర్యాల
రాష్ట్ర హద్దులు దాటుతున్న గంజాయి
యువతే టార్గెట్‌గా జోరుగా వ్యాపారం
ఏడాది గంజాయి విలువ నిందితులు
(కేజీల్లో) (రూ.లక్షల్లో)
2020 32.90 6.89 22
2021 34.48 3.70 14
2022 8.52 1.22 58
2023 34.78 7.76 58
2024 21.83 5.36 74
2025 120.27 60.13 16
(ఇప్పటివరకు)
పీడీయాక్ట్ నమోదు చేస్తాం
గంజాయి వ్యవహారంలో ఎంతటివారున్నా ఉపేక్షించబోం. గంజాయి తాగినా, అమ్మినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. నిందితులపై పీడీయాక్టు నమోదు చేస్తున్నాం.
– శ్రీనివాస్, పోలీసు కమిషనర్ రామగుండం
ఒడిశా టు మహారాష్ట్ర
Comments
Please login to add a commentAdd a comment