కరీంనగర్‌కల్చరల్: జాతీయ సాహిత్య పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో నాట్యాచార్యుడు రజనీశ్రీ పేరుపై రజినీశ్రీ కుమారుడు, మహాత్మా జ్యోతీ బాపూలే రెసిడెన్షియల్ పాఠశాలల సంయుక్త కార్యదర్శి జీవీ శ్యాంప్రసాద్‌లాల్ ఏటా రజినీశ్రీ పురస్కారం ప్రదానం చేస్తున్నారు. ఈ సంవత్సరం పురస్కారం కవిత్వానికి అందిస్తున్నట్లు సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు గాజుల రవీందర్, నందిని శ్రీనివాస్ తెలిపారు. పురస్కారం కింద ప్రశంసాపత్రం, రూ.10,016 అందజేస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన కవులు, రచయితలు జనవవరి 2022 నుంచి డిసెంబరు 2024 వరకు ముద్రితమైన తమ పద్య, గేయ, వచన కవితల సంకలనాలు మాత్రమే పంపాల్సి ఉంటుంది. శతకాలు, దీర్ఘ కవితలు, ల ఘురూప ప్రక్రియలు స్వీకరించరు. ప్రతీది నాలుగు ప్రతులను మార్చి 20లోపు గాజుల రవీందర్ ఇంటి నెం.8–3–255/1, రామచంద్రాపూర్ కాలనీ, రోడ్ నెం.12, భగత్ నగర్, కరీంనగర్, 505001 చిరునా మాకు పంపాలని సూచించారు. వివరాలకు 94904 01861 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment