ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చూపాలి
సాక్షి,పెద్దపల్లి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని, స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించే బాధ్యత తాము తీసుకుంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం బీజేపీ పచ్చీస్ ప్రభారి (25 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జి) సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. జిల్లాలోనూ గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌రావు, కాసిపేట లింగయ్య, కోమల ఆంజనేయులు లాంటి నేతలను చంపాలని నక్సలైట్లు పోస్టర్లు కూడా వేశారని, నక్సలైట్స్‌కు ఎదురొడ్డిన ఆ నేతలు కాషాయ జెండాను రెపరెపలాడించారని గుర్తుచేశారు. హిందువుల జాబితాలో ముస్లింలను ఎలా కలుపుతారని ప్రశ్నించారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి బిల్లు పంపితే కేంద్రప్రభుత్వం ఆమోదించే ప్రసక్తే లేదన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు లేకపోతే నాయకులు లేరని, కార్యకర్తల కష్టంతోనే ఇద్దరు సీఎంలను ఓడించానన్నారు. మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, కాసిపేట లింగయ్య, గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు మల్క కొమరయ్య, చిన్నమైల్ అంజిరెడ్డి పాల్గొన్నారు.
ఫ్లెక్సీలో నా ఫొటో ఎక్కడ?
అంతకుముందు జరిగిన మీడియా సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటో లేదని బీజేపీ నేత గోమాసె శ్రీనివాస్ అసంతప్తి వ్యక్తం చేశారు. తనకు గౌరవం తగ్గిదని జిల్లా అధ్యక్షుడిపై అసంతప్తి వ్యక్తం చేశారు. పోరపాటు జరిగిదంటూ సంజీవరెడ్డి సర్దిచెప్పారు.
దుగ్యాల వర్గం దూరం..
బండి సంజయ్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్, పచ్చీస్ ప్రభారీకి పెద్దపల్లి అసెంబ్లీ బీజేపీ ఇన్‌చార్జి దుగ్యాల ప్రదీప్‌రావు వర్గం దూరంగా ఉండటంతో కమలం పార్టీలో గ్రూప్ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. తమను పట్టించుకోవడం లేదని, అసంతృప్తితోనే సమావేశంకు దూరంగా ఉన్నామని దుగ్యాల వర్గం నేతలు చెబుతున్నారు.
బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి
కేంద్ర మంత్రి బండి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment